Leading News Portal in Telugu

కోల్ కతా ఆస్పత్రిలో నిర్భయ కంటే దారుణం.. వాడో మృగం!.. | kolkatta rape and murder case| human beast| atrocity| more| than| nirbhay


posted on Aug 16, 2024 6:57AM

కోల్ కతా ఆస్పత్రిలో  హత్యాచారానికి గురైన పీజీ ట్రైనీ వైద్యురాలి అటాప్సీ నివేదికలో దారుణమైన విషయాలు వెల్లడైనాయి. వాడు మనిషి కాదు మానవ రూపంలో ఉన్న మృగం అని ఆ అటాప్సీ నివేదిక వెల్లడించింది. ఆ నివేదికలో విషయాలు ప్రస్తావించడం సబబు కాకపోయినా ఆ దారుణాన్ని చెప్పక తప్పదు. కేవలం అత్యాచారం చేసి చంపడం కాదు.దారుణంగా చిత్రవధ చేసి చంపడం ఘోరం. అదీ ఆస్పత్రిలో హత్యాచారం చేయడం ఘోరాతిఘోరం.ఈ సంఘటనతో మహిళలకు రక్షణ ఎక్కడ అనే ప్రశ్న తలెత్తుతుంది.

తెల్లవారేవరకూ వైద్యురాలిపై జరిగిన దారుణం ఎవరికీ తెలియదు.ఆ రోజు రాత్రి ఆమె ఆసుపత్రి సెమినార్ హాలులోకి చదువుకుని ఆపై నిద్రపోయింది. ఆసమయంలో ఆ నరరూప రాక్షసుడు సంజయ్ రాయ్ అటువైపు వచ్చి ఆమెను చిత్రవధ చేసి అత్యాచారం చేసాడు. అతను  నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ముగ్గురు అతనిని భరించలేక వదిలిపోయారు.నాలుగో భార్య కేన్సర్ తో మృతి చెందిందని సమాచారం, ఇతను బీహార్ కు చెందినవాడు. ఇక్కడ పోలీసు సంక్షేమ శాఖ లో వాలంటీర్ గా పని చేస్తున్నాడు. ఆమె అరిస్తే దొరికిపోతానని గోడకేసి గట్టిగా అదిమి గొంతు పట్టుకున్నాడు. తలను గోడకేసి కొట్టాడు. ముఖం, కళ్లు కూడా దెబ్బతిన్నాయి, .మెడ విరిగింది. అలాగే శరీరంలోని అన్ని భాగాల లోంచి రక్తస్రావం అయింది. ప్రైవేటు పార్ట్స్ నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. ఇంకా దారుణమేమంటే చనిపోయిన తరువాత కూడా అత్యాచారం చేసినట్లు నివేదికలో వెల్లడయ్యింది.

అలాగే మృతురాలి శరీరంపై అధిక మొత్తంలో వీర్యం ఉండడం వల్ల ఇది సామూహిక అత్యాచారం గా అనుమానిస్తున్నారు. నిందితుడు సంజయ్ రాయ్ అత్యాచారం అనంతరం ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు. నిద్రలేచిన తరువాత రక్తమరకలు ఉన్న దుస్తులు నీళ్ల లో పిండినట్లు తెలిసింది. బూట్ల మీద రక్తం మరకలు కనిపించాయి. అతను బ్లూటూత్ హెడ్ సెట్ హత్యాస్థలం వద్ద వదిలివేయడం వల్ల పట్టుబడ్డాడు. రాయ్ అందరితో మంచిగా ఉన్నట్లు నటిస్తూ అవకాశం కోసం వేచి చూసి కాటు వేసాడని భావిస్తున్నారు. అందరూ తిరిగే ఆసుపత్రిలోనే ఇలాంటి దారుణం సంఘటన జరగడం ఆందోళన కలుగుతున్నది.