- ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి అనుమతి నిరాకరించిన భారత్
-
కొత్త వేదిక కోసం వెతుకుతున్న ఐసీసీ ( ICC) -
యుఏఈలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని వార్తలు.

ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అనుమతి నిరాకరించింది. దీంతో.. ఐసీసీ ( ICC) కొత్త వేదిక కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో.. యుఏఈలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా ఈ టోర్నీని అక్కడ నిర్వహించడం కష్టంగా మారింది. టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించడం గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో మాట్లాడింది. అయితే వచ్చే ఏడాది 50 ఓవర్ల మహిళల ప్రపంచ కప్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉందని.. ఈ కారణంగా వరుసగా రెండు ప్రపంచ కప్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి బీసీసీఐ నిరాకరించింది.
Cricbuzz నివేదిక ప్రకారం.. సమయ పరిమితుల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దుబాయ్/అబుదాబిని చేయాలని చూస్తోంది. దీనికి బీసీబీ (BCB) కొంత సమయం కోరింది. ఐసీసీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఐసీసీ కొత్త వేదికను ఆగస్టు 20న ఆన్‌లైన్ డైరెక్టర్ల సమావేశంలో ప్రకటించాలని భావిస్తుంది. అయితే ఈ సమావేశానికి వేరే ఎజెండా ఉంటుంది. మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వకపోవడంపై జై షా స్పందించారు. ‘వచ్చే ఏడాది 50 ఓవర్ల మహిళల ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాం. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగలరా అని బంగ్లాదేశ్ బీసీసీఐని అడిగింది. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది. వచ్చే ఏడాది మేము మహిళల వన్డే ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. నేను ఇవ్వదలచుకోలేదు. నేను ప్రపంచ కప్‌లను బ్యాక్ టు బ్యాక్ హోస్ట్ చేయాలనుకుంటున్నాను.” అని జైషా పేర్కొన్నారు.