Leading News Portal in Telugu

KTR: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్నే కలచివేస్తోంది


  • కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్నే కలచివేస్తోంది

  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్య
KTR: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్నే కలచివేస్తోంది

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన దేశాన్నే కలచివేస్తుందన్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మహిళలపై క్రూరత్వం వంటి ఘటనలు సిగ్గు పడేలా ఉన్నాయని తెలిపారు. స్త్రీ సమానత్వం దేశంలో కొరవడిందన్నారు. ఒక సమాజంగా కలిసి అభివృద్ధి చెందాలని.. చిన్నతనం నుంచి ఆడపిల్లలను అబ్బాయిలతో సమానంగా పెంచాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. ఇలాంటి తరుణంలో మహిళల పట్ల ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అన్నారు.

ఇది కూడా చదవండి: Jyotika: 45 ఏళ్ళ వయసులో కూడా జ్యోతిక ఇంత అందంగా ఉండడానికి కారణమేంటో తెలుసా?

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపిస్తోంది. అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురైంది. పోస్టుమార్టం రిపోర్టులో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తేలింది. ఇక ఈ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. వైద్యులు, నర్సులు రోడ్లుపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక శనివారం దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ చేశారు. కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే పని చేయనున్నాయి. ఇక ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ దురాగతాలు ఒక్కొక్కొటి వెలుగులోకి వస్తున్నాయి. ఆస్పత్రిలో ఒక మాఫియానే తయారు చేశాడని.. ఇక మాట వినకపోతే విద్యార్థులను ఫెయిల్ చేసేవాడని మాజీ ఉద్యోగులు చెప్పుకొస్తు్న్నారు.

ఇది కూడా చదవండి: Bar Council of India Meets AP CM: సీఎం చంద్రబాబుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల భేటీ..