- సీఎం చంద్రబాబుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ..
-
అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ ఏర్పాటుకు ముందుకొచ్చిన బార్ కౌన్సిల్.. -
సీఆర్డీఏ పరిధిలో బీసీఐకి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలి: సీఎం చంద్రబాబు

Bar Council of India Meets AP CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. బెంగళూరులోని NLSIU , గోవాలోని IIULER స్థాయిలో అమరావతిలో ప్రీమియర్ లా యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ప్రతినిధుల టీమ్ పేర్కొనింది. సీఆర్డీఏ పరిధిలో బీసీఐకి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాల్సిందిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కునార్ సింఘాల్ కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. లా యూనివర్శిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం సంతోషంగా ఉంది.. న్యాయ సంబంధిత రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు బీసీఐ ఏర్పాటు చేసే యూనివర్శిటీల ఆవశ్యకత ఎంతో ఉంది.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన అర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు బీసీఐ దోహదపడుతుంది అని సీఎం చంద్రబాబు తెలిపారు.