Leading News Portal in Telugu

VVS Laxman: మరో ఏడాది జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా పదవీకాలం పొడిగింపు..


  • వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా ఏడాది పాటు పొడిగించనున్నారు.
  • మూడేళ్ల కాంట్రాక్ట్ వచ్చే నెల సెప్టెంబర్‌తో ముగియనుంది.
  • ఎన్‌సిఎ కొత్త క్యాంపస్‌ కి మారనుంది.
VVS Laxman: మరో ఏడాది జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా పదవీకాలం పొడిగింపు..

VVS Laxman Extended his NCA Head: భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించనున్నారు. లక్ష్మణ్ మూడేళ్ల కాంట్రాక్ట్ వచ్చే నెల సెప్టెంబర్‌తో ముగియనుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు అతను ఓ ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌ గా మారవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే., ఈ అవకాశాలన్నింటినీ తిరస్కరిస్తూ.. ఎన్‌సీఏ చీఫ్‌గా తన పదవీకాలాన్ని పొడిగించే ప్రతిపాదనను లక్ష్మణ్ అంగీకరించారు. ఆయనతో పాటు ఆయన సహచరులు సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే, హృషికేశ్ కనిత్కర్‌ ల పదవీకాలం కూడా పొడిగించనున్నారు. 2021లో సౌరవ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లక్ష్మణ్‌కు ఎన్‌సిఎ అధిపతిగా మారారు.

Mahesh Babu: అరాచకం.. ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన మహేశ్ బాబు..

ఇకపోతే., ఇప్పుడు ఎన్‌సిఎ కొత్త క్యాంపస్‌ కి మారనుంది. అంతకుముందు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించారు. ఈ అత్యాధునిక NCA కాంప్లెక్స్‌లో 45 ఇండోర్ పిచ్‌లతో సహా కనీసం 100 పిచ్‌లు ఉంటాయి. ఈ సదుపాయంలో మూడు అంతర్జాతీయ పరిమాణ మైదానాలు, ఆధునిక పునరావాస కేంద్రం, వసతి సౌకర్యాలు, ఒలింపిక్ పరిమాణ కొలను ఇలా అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి. జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ పనులన్నీ చివరి దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆటగాళ్లకు ఈ సదుపాయాలన్నీ లభించే అవకాశం ఉంది.

Sanju Samson-KBC 16: సంజూ శాంసన్‌పై ప్రశ్న.. పోటీ నుంచి తప్పుకున్న కంటెస్టెంట్‌! ఎంతపని చేశావయ్యా

లక్ష్మణ్ కంటే ముందు రాహుల్ ద్రవిడ్ NCA బాధ్యతలు చేపట్టారు. 2021లో ద్రవిడ్‌ను టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా నియమించిన తర్వాత ఎన్‌సీఏ బాధ్యతలను లక్ష్మణ్‌కు అప్పగించారు. ఎన్‌సిఎలో ఆయన మొదటి మూడు సంవత్సరాల పదవీకాలంలో.. నిర్వహణ, క్రీడాకారుల పునరావాసం, కోచింగ్ కార్యక్రమాలు, సీనియర్ టీమ్ – జూనియర్ జట్లతో మహిళల క్రికెట్ కోసం లక్ష్మణ్ గొప్ప రోడ్‌ మ్యాప్‌ ను రూపొందించారు.