Leading News Portal in Telugu

Congress: జమ్మూకాశ్మీర్ పీసీసీ చీఫ్‌గా తారిఖ్ హమీద్ కర్రా నియామకం


జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నగారా మోగింది. శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్ పీసీసీ అధ్యక్షుడిగా తారిఖ్ హమీద్ కర్రా, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తారా చంద్, రామన్ భల్లాలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమించారు.

జమ్మూకాశ్మీర్‌లో 3 విడతల్లో పోలింగ్
సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న పోలింగ్
అక్టోబర్ 4న జమ్మూకాశ్మీర్ కౌంటింగ్

మొదటి ఫేజ్ ఎన్నికలకు ఆగస్టు 20-08-2024న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ చివరి తేది 27-08-2024న ముగియనుంది. పోలింగ్ మాత్రం 18-09-2024న జరగనుంది. ఇక రెండో విడత పోలింగ్‌కి 29-08-2024న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్‌కు చివరి గడువు 05-09-2024న ముగియనుంది. పోలింగ్ మాత్రం 25-09-2024న జరగనుంది. చివరి విడత పోలింగ్ కోసం 05-09-2024న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ గడువు 12-09-2024న ముగియనుంది. పోలింగ్ మాత్రం 01-10-2024న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న విడుదల కానున్నాయి.

 

Pcc