Leading News Portal in Telugu

Viral video: రెజ్లర్ బజరంగ్ పునియా దుశ్చర్య.. జాతీయ జెండా పోస్టర్‌పై కాళ్లు.. నెటిజన్ల విమర్శలు


  • రెజ్లర్ బజరంగ్ పునియా దుశ్చర్య

  • జాతీయ జెండా పోస్టర్‌పై కాళ్లు పెట్టిన పునియా

  • నెటిజన్ల విమర్శలు.. చర్యలకు డిమాండ్
Viral video: రెజ్లర్ బజరంగ్ పునియా దుశ్చర్య.. జాతీయ జెండా పోస్టర్‌పై కాళ్లు.. నెటిజన్ల విమర్శలు

రెజ్లర్ బజరంగ్ పునియా తీరు విమర్శల పాలైంది. సోషల్ మీడియా వేదికగా రెజ్లర్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రజతం పతకం కోల్పోయి.. తీవ్ర మనస్తాపంతో వినేష్ ఫోగట్‌ భారత్‌కు తిరిగొచ్చింది. శనివారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడ సాటి క్రీడాకారులు, క్రీడాభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆమెకు స్వాగతం పలికారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే వినేష్ ఫోగట్‌ను ఓపెన్ టాప్‌లో ర్యాలీగా తీసుకెళ్తుండగా సాటి రెజ్లర్ బజరంగ్ పునియా.. కారు కేబిన్‌పై ఉన్న జాతీయ జెండాపై కాళ్లు వేశారు. చూడకుండా వేశారో.. తొందరపాటులో అలా జరిగిందో తెలియదు గానీ… ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాతీయ జెండాను అవమానించారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. పునియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Jagadish Reddy: ఇది భయంకరమైన మోసం.. రైతులు ఐక్యం కావాలని జగదీశ్ రెడ్డి పిలుపు

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ మహిళల 50 కేజీల ఈవెంట్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంతో ఆమె అనర్హతకు గురైంది. దీంతో బంగారు పతకం మిస్ అయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం సిల్వర్ ఇవ్వాలని కాస్‌(CAS)ను అభ్యర్థించింది. కానీ అందుకు నిరాకరించారు. వినేష్‌కు భారతీయులంతా అండగా నిలిచారు.

ఇది కూడా చదవండి: Ram Mohan Naidu: ఏపీలో ప్రస్తుతం 7 విమానాశ్రయాలను 14కు పెంచాలని నిర్ణయం..