- కోల్‌కతా రేప్ ఘటనపై సూర్యకుమార్ ఇన్స్టాలో పోస్ట్
-
ఇలాంటి ఘటనలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు మెస్సెజ్ -
ఇన్‌స్టాలో ఓ స్టోరీని పంచుకున్న సూర్య కుమార్.

కోల్‌కతాలో జరిగిన సామూహిక అత్యాచారం-హత్య ఘటన అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌తో పాటు యావత్ దేశమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఇలాంటి అనేక సంఘటనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇలాంటి ఘటనలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక మెస్సెజ్ ఇచ్చాడు. ఆయన ఇన్‌స్టాలో ఓ స్టోరీని పంచుకున్నాడు. ‘కూతుర్ని కాపాడుకోవడం కంటే.. కొడుకు, తమ్ముడు, భర్త, తండ్రి, స్నేహితులకు చదువు చెప్పించడం మేలు’ అని తెలిపాడు.
సూర్యకుమార్ యాదవ్ తన ఇన్‌స్టా స్టోరీలో ఆదివారం (ఆగస్ట్ 18) ఒక ఫొటోను పోస్ట్ చేసాడు. అందులో “మీ కూతుర్ని రక్షించండి” అని రాశాడు. అయితే.. అతను ఈ లైన్‌ను కట్ చేసి, మీ కొడుకును ఎడ్యుకేట్ చేయండి. మీ సోదరులకు చదువు చెప్పండి, మీ తండ్రికి, భర్తలకు మరియు స్నేహితులకు చదువు చెప్పండి. మీరు మీ కొడుకు, సోదరులకు చదువు చెప్పించకపోతే, ఇలాంటివే జరుగుతాయని చెప్పాడు. కూతుళ్లను రక్షించాల్సిన అవసరం లేదు.. కానీ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూర్య స్పష్టంగా చెప్పాడు.
సూర్యకుమార్ గురించి మాట్లాడితే.. అతను ప్రస్తుతం బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో భారత్‌కు ఆడాలనుకుంటున్నట్లు తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. కానీ.. వన్డే ఇంటర్నేషనల్, టెస్ట్‌లో అతని రికార్డు అంత బాగా లేదు. ఈ క్రమంలో అతన్ని ఆ ఫార్మాట్ల నుంచి తప్పించారు. ప్రస్తుతం టీ20 జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు వహిస్తున్నాడు. కాగా.. వన్డే, టెస్ట్ జట్టులో పునరాగమనం కోసం ఎదురు చూస్తున్నాడు.