Leading News Portal in Telugu

Raksha Bandhan 2024: సోదరులకు రాఖీ కట్టి.. తుదిశ్వాస విడిచిన యువతి!


  • ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ
  • మహబూబాబాద్‌లో విషాదం
  • రాఖీ కట్టి చనిపోయిన యువతి
Raksha Bandhan 2024: సోదరులకు రాఖీ కట్టి.. తుదిశ్వాస విడిచిన యువతి!

ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ‘రాఖీ’ పండుగను నేడు ప్రపంచవ్యాప్తంగా హిందూవులు సంతోషంగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తన సోదరుల చేతి మణికట్టుకు రాఖీలను కడుతున్నారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు బహుమతి ఇచ్చి సంతోషపరుస్తున్నారు. అయితే రాఖీ పండుగ వేళ మహబూబాబాద్‌లో విషాదం నెలకొంది. సోదరులకు రాఖీ కట్టిన కొద్ది గంటల్లోనే ఓ యువతి ప్రాణాలు విడిచింది.

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంకు చెందిన 17 ఏళ్ల యువతి కోదాడలో డిప్లొమా చేస్తోంది. ఓ అబ్బాయి ప్రేమ పేరుతో ఆ యువతి వెంటపడుతున్నాడు. తీవ్ర మనస్థాపం చెందిన ఆ యువతి.. గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు ఆమెను మహబూబాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చావుబతుకుల మధ్య ఉన్న ఆ యువతి.. రక్షాబంధన్‌ వరకు తాను బతికుంటానో లేదో అనుకుని.. శనివారం రాత్రి తన అన్న, తమ్ముడికి రాఖీ కట్టింది. రాఖీ కట్టిన కొద్ది గంటల్లోనే ఓ యువతి తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. ఈ ఘటనతో యువతి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.