Leading News Portal in Telugu

Abhishek Singhvi: రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మను సింఘ్వీ


  • తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ వేశారు..

  • అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు..
Abhishek Singhvi: రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మను సింఘ్వీ

Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ వేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. నామినేషన్‌ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ దగ్గర మీడియాతో మాట్లాడారు. సోదరి మరియు సోదరీమణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు.

Read also: Kolkata Rape Case: రేప్ కన్ఫర్మ్, నో ఫ్రాక్చర్… పోస్టుమార్టం నివేదిక ఏం చెబుతుందంటే.?

కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు రుణాలు ఇవ్వలేదు.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు రుణాలు ఇచ్చింది. మా ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అభిషేక్ సింఘ్వి మను స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుండి వచ్చారు. మన రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వీ వెళ్లిపోవడం వల్ల మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలని కోరుకుంటున్నట్లు అభిషేక్ సింఘ్వీ మను తెలిపారు. సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా సీఎల్పీ ఆదివారం ఖరారు చేసింది. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందుకు గర్విస్తున్నానని సింఘ్వీ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై రాజ్యసభ, కోర్టుల్లో తన వాదన వినిపిస్తామన్నారు.
Raksha Bandhan 2024: సోదరులకు రాఖీ కట్టి.. తుదిశ్వాస విడిచిన యువతి!