- కోటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో జూడాల ధర్నా..
-
నిరసనలో పాల్గొన్న గాంధీ- ఉస్మానియా జూడాలు.. - హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్స్ కు రక్షణ కల్పించాలని డిమాండ్..

Hyderabad: హాస్పిటల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూడాల ధర్నా చేపట్టారు. స్మానియా మెడికల్ కాలేజ్ చేపట్టిన నిరసనలో గాంధీ, ఉస్మానియా జూడాలు పాల్గొన్నారు. హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్స్ కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్స్ లో రీసోర్సెస్ పెంచాలి.. వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కలకత్తా లో ట్రైనీ డాక్టర్ ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సేవ్ ది సేవియర్స్ పేరుతో జూడాలు వైట్ క్లాత్ పై తమ చేతి ముద్రలను వేసి నిరసన వ్యక్తం చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఉస్మానియా కాలేజ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించిన జూడాలు. Justice For RG KAR పేరుతో జూడాలు మానవహారం నిర్వహించారు.
Read also: Raksha Bandhan: అన్నా చెల్లెలి అనుబంధం.. తెలుగు సినిమాలకు మూలం
కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో గత వారం అత్యాచారం హత్యకి గురైన 31 ఏళ్ల ట్రైనీ పీజీ డాక్టర్ ఘటన దేశంలో ఆగ్రహావేశాలకు కారణమైంది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమెను అత్యంతదారుణంగా రేప్ చేసి చంపారు. కాలేజీలోని సెమినార్ హాలులోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసుని ఇప్పటికే కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. ఇదిలా ఉంటే నిందితుడు సంజయ్ రాయ్‌కి కోర్టు అనుమతితతో బ్రెయిన్ మ్యాపింగ్, లై డిటెక్టర్, నార్కో అనాలిస్ వంటి పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ సిద్ధమైంది. మరోవైపు ఇతడి మానసిక స్థితిని అంచనా వేసేందుకు సీబీఐ ‘‘ సైకలాజికల్ టెస్టు’’ని నిర్వహిస్తోంది.
Read also: Hyderabad Rains: హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం..
ఈ పరీక్షకు కోర్టు అనుమతి అవసరం లేదు. ఈ పరీక్ష నిర్వహించేందుకు నిన్న కోల్‌కతాకు ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ వైద్యుల బృందం చేరుకుంది. ముందుగా వీరు సంజయ్ రాయ్‌ని ప్రశ్నించనున్నారు. మరోవైపు బాధితురాలి మృతదేహం లభించిన సెమినార్ హాలు నుంచి ఆధారాలు సేకరించడానికి సీబీఐ ఫోరెన్సిక్ టీం ఆర్జీకర్ ఆస్పత్రిలోనే ఉంది. సైకలాజికల్ టెస్టులో నిందితుడి మానసిక విశ్లేషణ చేసి అంచనా వేయనున్నారు. ఇది అండర్ ట్రయల్స్‌లో వారి అలవాట్లు, దినచర్య, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి చేస్తారు. ఈ పరీక్షలో, దర్యాప్తు సంస్థ బృందం రాయ్ వాయిస్‌ని లేయర్డ్ వాయిస్ విశ్లేషణలో ఉంచవచ్చు, అంటే లై-డిటెక్టర్ పరికరం, దాని ద్వారా అతను నిజమే చెబుతున్నాడో లేదో నిర్ధారించుకోవచ్చు.
Kolkata Doctor Rape Murder: దారుణంగా అత్యాచారం.. శరీరంపై 14 చోట్ల గాయాలు!