- గుణదల ఈఎస్ఐ ఆస్పత్రిని ప్రారంభించిన కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్
- గత ఐదేళ్ల పాలనలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని నిర్వీర్యం చేశారని విమర్శలు

Minister Subhash: విజయవాడ గుణదల ఈఎస్ఐ ఆస్పత్రిని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. గత ఐదేళ్ల పాలనలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని నిర్వీర్యం చేసి అవినీతిమయం చేశారని ఆయన మండిపడ్డారు. సరైన పరికరాలు లేకుండా చేశారని.. ఉద్యోగుల భర్తీని కూడా చేయలేదన్నారు. గత ఐదేళ్ల సిబ్బంది కొరత ఏర్పడిందని మంత్రి తెలిపారు. చాలా మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. వైఎస్సార్ భీమా పేరుతో నాశనం చేశారని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్ని పక్కదారి పట్టించారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో ఈఎస్ఐ హాస్పిటల్స్ జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందన్నారు. దళారీ వ్యవస్థ కారణంగా భారీ స్థాయిలో కుంభకోణాలు జరిగాయని విమర్శలు గుప్పించారు. వైయస్సార్ బీమాలో జరిగిన అవినీతిపైన విచారణ జరిపిస్తామన్నారు. టీడీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని.. చంద్రబాబుతో సహా అందరూ కడిగిన ముత్యం లాగా అందరూ బయటకు వచ్చారన్నారు. జగన్ తను చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని భయపడి అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు. జగన్‌కి ఆ 10 స్థానాలు కూడా ఉండవని.. చివరికి ఆ పార్టీలో మిగిలేది జగన్ ఒక్కడే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మినహా మిగతా ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ మంత్రి పేర్కొన్నారు. కానీ డోర్లు తెరవమంటూ.. మీ ఇంటికి మీరే పరిమితం అవ్వండి అని చెప్పామన్నారు.