Leading News Portal in Telugu

UP video: స్కూటీపై వెళ్తుండగా యువతికి పోకిరీలు వేధింపులు.. వీడియో వైరల్


ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా ఘటనతో దేశం అట్టుడుకుతోంది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా కూడా కామాంధుల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. కనీస భయం లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. అది కూడా బుల్డోజర్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా రాత్రివేళ ఒంటరిగా స్కూటీపై వెళ్తున్న యువతిని పోకిరీలు వేధింపులకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉతరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: PM Modi Ukraine visit: పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోడీ..

రాత్రి సమయంలో స్కూటర్‌పై ఓ యువతి వెళ్తోంది. కొందరు యువకులు వేధింపులకు గురిచేశారు. ఐదుగురు యువకులు రెండు బైక్‌లపై ఆమెను వెంబడిస్తూ అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించారు. మరొకరు తోసే ప్రయత్నం కూడా చేశారు. అలా కొన్ని కిలోమీటర్లు అనుసరిస్తూనే ఉంది. భయంతో స్పీడ్‌గా వెళ్లినా వెంటాడుతూనే ఉన్నారు. అనంతరం ఆమెకు ట్రాఫిక్ పోలీసు కనిపించడంతో ఆయన దగ్గరకు వెళ్లి తన పరిస్థితిని వివరించింది. పోలీస్ సాయంతో ఆమె బయటపడినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆమెను రక్షించేందుకు ఎవరు ముందుకు రాకపోవడంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనలో యువతిని వేధించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: GST Notice to IIT Delhi: ఐఐటీ ఢిల్లీకి రూ.120 కోట్ల జీఎస్టీ నోటీసు.. కేంద్ర విద్యాశాఖ జోక్యం!