- రాఖీ పండగ పూట తీవ్ర విషాదం
-
తన సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చిన యువకుడి హత్య -
ఫరీదాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లో ఘటన -
బైక్‌పై వచ్చి ఇంట్లోకి చొరబడి యువకుడి హత్య -
మృతి చెందిన వ్యక్తి ఆర్కిటెక్ట్ చదువుతున్న అరుణ్ కుమార్.

రాఖీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ యువకుడిని దుండగులు హత మార్చారు. ఈ ఘటన ఫరీదాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లో చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన దుండగులు.. ఇంట్లోకి చొరబడి ఆర్‌ఎంపీ డాక్టర్ కొడుకును హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. మృతి చెందిన వ్యక్తి ఆర్కిటెక్ట్ చదువుతున్న అరుణ్ కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
UP News: భార్య ముక్కు కోసేసిన భర్త.. కారణం ఏంటంటే..?
వివరాల్లోకి వెళ్తే.. ఫరీదాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం అరుణ్ తల్లిదండ్రులు రాఖీ, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వెళ్లారు. ఈ సమయంలో అరుణ్ తన ఇంట్లో సోదరి, సోదరుడితో కలిసి ఓ గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చారు. ఓ యువకుడు ఇంటి బయట ఉండగా.. మరోవ్యక్తి అరుణ్ ఇంట్లోకి వెళ్ళాడు. అరుణ్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. మాట్లాడుతుండగానే ఒక్కసారిగా జేబులోంచి పిస్టల్ తీసి కాల్చాడు. దీంతో.. ఛాతీలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఈ క్రమంలో.. అరుణ్ రక్తస్రావంతో కింద పడిపోయాడు.
ఈ మొక్కలు ఇంట్లో పెంచుకుంటే స్వచ్ఛమైన గాలి.. ఆ సమస్యలకు చెక్..!
ఘటనను చూసిన అతని సోదరి, సోదరుడు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. వెంటనే బైక్‌పై తన స్నేహితుడితో కలిసి పరారయ్యాడు. కాగా.. అరుణ్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. అరుణ్ తండ్రి ఆర్‌ఎంపీ వైద్యుడు, అరుణ్ రోహ్‌తక్‌లోని ఓ కాలేజీలో ఆర్కిటెక్ట్ చదువుతున్నాడు. రక్షా బంధన్ పండుగను జరుపుకునేందుకు ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.