Leading News Portal in Telugu

Jaya Krishna Ghattamaneni : మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తల్లోంచి ఊడిపడినట్టున్నాడుగా!


Jaya Krishna Ghattamaneni : మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తల్లోంచి ఊడిపడినట్టున్నాడుగా!

Ramesh Babu’s son Jaya Krishna Ghattamaneni Set For Film Debut: దిగ్గజ నటుడు కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ మధ్యనే ఫ్యామిలీ ఈవెంట్‌కి హాజరై వార్తల్లో నిలిచిన జయ కృష్ణ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో గ్రాండ్‌గా అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. Jayakrishnaజయ కృష్ణ యునైటెడ్ స్టేట్స్‌లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. తన తాత కృష్ణ, తండ్రి రమేష్ బాబు, బాబాయి మహేష్ బాబు వలె తన ముద్ర వేయడానికి బాగా సిద్ధమయ్యాడని రానున్నారు. జయ కృష్ణ ఎంట్రీపై సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

Jayakrishna1

Jayakrishna1

ప్రస్తుతం, జయ కృష్ణ తన అరంగేట్రం కోసం సరైన సినిమా ఎంచుకోవాలనే లక్ష్యంతో ప్రముఖ ఫిల్మ్ బ్యానర్‌ల నుండి అనేక కథలు వింటున్నారని, కథ ఖరారు కాగానే అతని మొదటి సినిమా వివరాలు వెల్లడి కానున్నాయని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, జయ కృష్ణ తాజా ఫోటో షూట్ ఇప్పటికే చాలా మంది దృష్టిని ఆకర్షించింది. జయ కృష్ణ సూట్ ధరించి స్టైలిష్ గా కనిపిసున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.