Leading News Portal in Telugu

Vinesh Phogat: ఎవరికీ మినహాయింపు ఉండదు.. ఆ బాధ్యత వినేశ్‌ ఫొగాట్‌దే: కాస్‌


  • వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు
  • అప్పీలును తిరస్కరించిన కాస్‌
  • ఎవరికీ మినహాయింపు ఉండదు
Vinesh Phogat: ఎవరికీ మినహాయింపు ఉండదు.. ఆ బాధ్యత వినేశ్‌ ఫొగాట్‌దే: కాస్‌

CAS React on Vinesh Phogat Appeal: తమ బరువును పరిమితి లోపు ఉంచుకునే బాధ్యత అథ్లెట్లదే అని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ మినహాయింపు ఉండదని ద కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌ (కాస్‌) స్పష్టం చేసింది. ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. వినేశ్‌ గోల్డ్ మెడల్ సాధిస్తుందని అనుకున్నా.. అనర్హత వేటు కారణంగా అందరూ నిరాశకు గురయ్యారు.

పారిస్‌ ఒలింపిక్స్‌లో తన అర్హతను సవాలు చేస్తూ వినేశ్‌ ఫొగాట్‌.. కాస్‌కు అప్పీలు చేసుకుంది. రజత పతకంకు తాను అర్హురాలిని అంటూ కోరింది. అయితే వినేశ్‌ చేసుకున్న అప్పీలును కాస్‌ తిరస్కరించింది. అందుకుగల కారణాలను కాస్‌ తాజాగా వివరించింది. ‘నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. బరువు విషయంలో నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయి. నిబంధనలలో ఎవరికీ మినహాయింపు ఉండదు. బరువు పరిమితి దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత అథ్లెట్‌దే’ అని పేర్కొంది.