- సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి మైనంపల్లి హనుమంతరావు సవాల్
- రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్
- ఉప ఎన్నికల్లో హరీష్ రావు గెలిస్తే నేను ఎన్నికల్లో పోటీ చేయనని వ్యాఖ్య

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి మైనంపల్లి హనుమంతరావు సవాల్ విసిరారు. రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో ఇద్దరం నిలబడదామని, మళ్లీ హరీష్ రావు గెలిస్తే నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన అన్నారు. సిద్దిపేటలో రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీకి రావాలి మైనంపల్లి హనుమంత రావు డిమాండ్ చేశారు. సిద్ధిపేటలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. బీఆరెస్ రుణమాఫీ సమస్యపై సమావేశం నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ సంబర సభను నిర్వహించింది. కాంగ్రెస్ సభకు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హాజరయ్యారు.
TDR Bonds: టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా సర్కార్ చర్యలు
ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 15తేదీ నాటికి రుణమాఫీ చేశారని, హరీష్ రావు చేసిన సవాల్ మేరకు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేట ఉప ఎన్నికల్లో ఇధ్దరం పోటీ చేద్దామని, మళ్లీ హరీష్ రావు గెలిస్తే నేను భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోనని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నా సవాల్‌కు హరీష్ రావు ముందుకు రావాలని ఆయన అన్నారు. నీకు మైనంపల్లి పీడ పోవాలంటే రాజీనామా చేసి నాతో ఎన్నికల్లో తలపడాలని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మైనంపల్లి లేదా హరీష్ రావు ఒక్కరే ఉండాలన్నారు.
Amaravati: రాజధాని పరిధిలో కొనసాగుతోన్న జంగిల్ క్లియరెన్స్