- కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగవంతం
-
నిందితుడు సంజయ్ రాయ్ సన్నిహితుడికి నోటీసులు -
మీడియాను చూసి పరుగులు పెట్టిన ఏఎస్ఐ అరుప్ దత్తా

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. సీబీఐ తనదైన శైలిలో విచారణ చేస్తోంది. మంగళవారం కోల్‌కతాలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం దగ్గర ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగే ఏఎస్ఐ అరుప్ దత్తా సీబీఐ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి వచ్చారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అంతే సీబీఐ కార్యాలయంలోకి అతడు పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది.
ఇది కూడా చదవండి: BJP: రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. సీనియర్ న్యాయవాదికి ఛాన్స్
పశ్చిమ బెంగాల్ పోలీస్ శాఖలో అరుప్ దత్తా ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అతడి స్నేహితుడు సంజయ్ రాయ్ కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడు. వైద్యురాలిపై హత్యాచారం అనంతరం ఈ ఏఎస్ఐ అరుప్ దత్తాకు సంజయ్ రాయ్.. తన సెల్‌ఫోన్ నుంచి పలుమార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. దీంతో తమ విచారణకు హాజరుకావాలని అరుప్ దత్తాకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. అలా సీబీఐ కార్యాలయానికి వచ్చిన దత్తాను మీడియా ప్రతినిధులు గుర్తించి.. ప్రశ్నించేందుకు ముందుకు దూసుకు వచ్చారు. అంతే వారి ప్రశ్నల తాకిడికి తట్టుకోలేక.. ఏఎస్ఐ సీబీఐ కార్యాలయంలోకి పరుగులు పెట్టాడు. అత్యాచార ఘటనకు ముందు వీరిద్దరు మద్యం సేవించినట్లుగా గుర్తించారు. అలాగే హత్యాచార ఘటనపై పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఇక మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను కూడా దర్యాప్తు సంస్థ లోతుగా విచారిస్తోంది.
ఇది కూడా చదవండి: Badlapur sexual assault case: లైంగిక వేధింపులపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్.. సిట్ ఏర్పాటు
#WATCH | RG Kar Medical College and Hospital rape-murder case | Accused Sanjoy’s Roy close associate sprints and reaches CBI Special Crime Branch office in Kolkata. pic.twitter.com/RQezqhswEj
— ANI (@ANI) August 20, 2024