- నగరంలో కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ లో నీటి ఉదృతి పెరిగింది..
-
ఎఫ్టిఎల్ లెవెల్ ను పరిశీలించిన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి..

Hussain Sagar: నిన్నటి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ లో నీటిమట్టం పెరిగింది. ఎఫ్డిఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం వరకు 513.60 మీటర్లకు వాటర్ లెవెల్ చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు హుస్సేన్ సాగర్ జలాశయం నిండు కుండలా తలపిస్తుంది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు పై నుండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదల సందర్భంగా దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ లెవెల్ ను హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి పరిశీలించారు.
Read also: Revanth Reddy Strong Counter: విగ్రహంపై చేయి వేసి చూడు.. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..
నగరంలో కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ లో నీటి ఉదృతి పెరిగిందన్నారు. వరద ఉధృతి పెరగడంతో ఎఫ్టీఎల్ లెవెల్ ను మించి వరద నీరు చేరిందనిత తెలిపారు. ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 ఉండగా ప్రస్తుతం 513.60 చేరింది. వరద ఉధృతి పెరగడంతో హుస్సేన్ సాగర్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. దిగువ ప్రాంతాల్లో కూడా ప్రజలను అధికారులను అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఎమర్జెన్సీ టీం లను అలెర్ట్ గా ఉంచామని వెల్లడించారు. రామ్ నగర్ లో జరిగిన జరిగిన సంఘటన పై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇంకెక్కడా అలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు.
Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువకుడు బలి.. రూ.2కోట్ల అప్పులు చేసిన వైనం