- రసవత్తరంగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు..
-
కమలా హారిస్ ప్రెసిడెంట్ విధులు నిర్వర్తించడానికి రెడీగా ఉంది.. -
అమెరికాకు కాబోయే అధ్యక్షురాలు కమలా హారిస్: బరాక్ ఒబామా

Barack Obama: అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ కోసం యూఎస్ సిద్ధంగా ఉంది.. ప్రెసిడెంట్ విధులు నిర్వర్తించడానికి రెడీగా ఉన్నారంటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ప్రజల కోసం జీవితాంతం పని చేసిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం వచ్చింది.. ఆమె అమెరికాకు కాబోయే అధ్యక్షురాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒక అత్యున్నతమైన అధ్యక్షుడిగా జో బైడెన్ దేశ చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా ఒబామా వ్యాఖ్యానించారు.
కాగా, షికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో భాగంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడాతూ.. ఇక, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై బరాక్ ఒబామా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికన్లు తమ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని.. రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కమలా చేతిలో ఓడిపోతానేమోనని భయపడుతున్నారు.. దీంతో తన బాధలు, మనోవేదనలను ఎవరికి చెప్పుకోవాలో అతడికి అర్థం కావడం లేదంటూ ఒబామా మండిపడ్డారు. ఇక, ఆయన సతీమణి మిషెల్ ఒబామా కూడా కమలా హారిస్‌కు మద్దతు పలుకుతూ ప్రసంగించారు.