Leading News Portal in Telugu

Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌కు మళ్లీ నోటీసులు..


  • మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరోసారి నోటీసులు..

  • మూడోసారి నోటీసులు ఇచ్చిన మంగళగిరి పోలీసులు..

  • ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్న పోలీసులు..
Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌కు మళ్లీ నోటీసులు..

Jogi Ramesh: వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని జోగి రమేష్‌కు ఇచ్చిన తాజా నోటీసుల్లో పేర్కొన్నారు మంగళగిరి పోలీసులు.. గత ప్రభుత్వ హయాంలో అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో.. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇవ్వగా ఒకసారి విచారణకు జోగి రమేష్ హాజరయ్యారు.. అయితే, నిన్న జోగి రమేష్ హాజరు కాకపోవడంతో ఆయన తరఫున న్యాయవాదులు పోలీసులకు కలిసి వివరణ ఇచ్చారు.. తాజాగా నిన్న రాత్రి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు..

కాగా, ఇప్పటికే ఓసారి పోలీసుల విచారణకు హజరైన జోగి రమేష్.. మంగళవారం మరోసారి విచారణకు రావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. అయితే, జోగి రమేష్‌ తరపున ఆయన న్యాయవాదులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరణ ఇచ్చారు. విచారణకు రావడం లేదని తెలియజేశారు. గత శుక్రవారం జోగి రమేష్‌ మంగళగిరి పోలీసుల ఎదుట హాజరుకావడంతో.. గంటన్నర పాటు ప్రశ్నించి పంపించారు పోలీసులు.. అయితే, ఈ కేసులో మరోసారి విచారణకు మంగళవారం హజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో.. ఆయనను అరెస్టు చేస్తారని చర్చ మొదలైంది.. దీంతో.. ఆయన విచారణకు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతుండగా.. మూడోసారి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.