Leading News Portal in Telugu

Andhra Pradesh: చావు కూడా ఆ దాంపత్యాన్ని విడదీయలేదు.. భర్త మరణంతో కుప్పకూలి భార్య మృతి


  • 50 ఏళ్ల దాంపత్య జీవితాన్ని గడిపిన ఓ జంట.. ఒకేరోజు కన్నుమూత..

  • అనారోగ్య సమస్యలతో భర్త మృతి..

  • భర్త మృతదేహం దగ్గర కుప్పకూలి ప్రాణాలు విచిడిన భార్య..
Andhra Pradesh: చావు కూడా ఆ దాంపత్యాన్ని విడదీయలేదు.. భర్త మరణంతో కుప్పకూలి భార్య మృతి

Andhra Pradesh: మూడుముళ్లతో ఒక్కటయ్యారంటే.. ఆ దాంపత్యం కట్టె కాలే వరకు కొనసాగుతుంది అంటే ఇదేనేమో.. పెళ్లి ఇద్దరు తెలిసిన వ్యక్తులనే కాదు.. అసలు పరిచయమే లేని ఇద్దని ఏకం చేస్తుంది.. ఎన్నో జీవితాల్లో పెళ్లి గాఢమైన అనుబంధాన్ని పెనవేస్తుంది. ఆ బంధం చివరి వరకు కొనసాగుతుంది. ఉఛ్వాస, నిశ్వాసల్లా ఒకే ఇంటిలో కలిసి జీవితాన్ని గడుపుతారు. బాధ్యతలు నెరవేరుస్తారు. కాలగర్భంలో కలిసిపోయేవరకు వారి మధ్య అదే అనోన్యత కొనసాగిస్తారు.. అలాంటి జంటలు అరుదుగానే ఉంటాయి.. ఏకంగా 50 ఏళ్ల దాంపత్య జీవితాన్ని గడిపిన ఓ జంట.. ఒకేరోజు కన్నుమూసిన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది..

మూడుముళ్ల బంధంతో ఒకటైన దూదేకుల చిన్న తిరుపాలు, దూదేకుల అక్కమ్మ దంపతుల దాంపత్య జీవితం మరణం వరకు కొనసాగింది.. ఇద్దరు ఒకే రోజు మృత్యువు ఒడిలోకి చేరారు.. బండి ఆత్మకూరు మండల పరిధిలోని వెంగళరెడ్డిపేట గ్రామానికి చెందిన దూదేకుల చిన్న తిరుపాలు (70), భార్య దూదేకుల అక్కమ్మ (65).. ఇద్దరిదీ 50 ఏళ్ల దాంపత్య జీవితం. వారికి ఐదుగురు సంతానం. అయితే, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ చివరకు తిరుపాలు మృతి చెందాడు.. ఓవైపు తిరుపాలుకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. తన భర్త తిరుపాలు మృతదేహం వద్ద అక్కమ్మ కూడా కుప్పకూలి కన్నుమూసింది.. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. ఇక, ఒకేసారి ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించడం కూడా ఆ కుటుంబానికి భారంగా కావడంతో.. గ్రామస్తులు తలా ఒక చెయ్యి వేసి తిరుపాలు- అక్కమ్మలకు అంత్యక్రియలు నిర్వహించారు..