- మహారాష్ట్రలో వెలుగులోకి మరో దారుణం..
-
ఆరుగురు బాలికలకు అశ్లీల వీడియోలు చూపించిన టీచర్.. -
అకోలా స్కూల్ టీచర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

Maharashtra: మహారాష్ట్రలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. టాయిలెట్‌లో ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న సంఘటన మరిచిపోక ముందే.. ఒక టీచర్ వక్రబుద్ధి బయట పడింది. అకోలా జిల్లాకు చెందిన ఓ స్కూల్ లోని ఆరుగురు బాలికలకు అశ్లీల వీడియోలు చూపాడని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు నెలలుగా అతడు విద్యార్థినులకు ఈ పోర్న్ వీడియోలు చూపించి, వేధిస్తున్నాడని సమాచారం. వారు కంప్లైంట్ చేయడంతో ఇప్పుడు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
బాలల సంక్షేమ కమిటీ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఆ అమ్మాయిలు కాల్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఆ కమిటీ సభ్యులు మంగళవారం అకోలాలోని స్కూల్ కు వచ్చి, వారితో మాట్లాడాగా.. దాని తర్వాత వేధింపుల అభియోగాల కింద సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. ఆ వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇక, ఇదిలాఉంటే.. మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపుర్ పట్టణంలో మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు లైంగిక వేధింపులకు గురి కావడం సంచలనం రేపుతుంది.