Leading News Portal in Telugu

Extremely Sad: మురికికాలువలో రెండేళ్ల చిన్నారి.. 12 గంటల తరువాత మృతదేహం లభ్యం


  • నిజామాబాద్ ఆనంద్ నగర్లో విషాదం..

  • డ్రైనేజీ కాల్వలో గల్లంతైన మూడేళ్ల చిన్నారి అనన్య మృతి..

  • సుమారు 12 గంటల తరువాత అనన్య మృతదేహం లభ్యం..
Extremely Sad: మురికికాలువలో రెండేళ్ల చిన్నారి.. 12 గంటల తరువాత మృతదేహం లభ్యం

Extremely Sad: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మురికి కాల్వలో గల్లంతైన బాలిక కథ విషాదంగా ముగిసింది. ఆనందనగర్‌లో బుధవారం సాయంత్రం డ్రైనేజీలో గల్లంతైన చిన్నారి మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది. చిన్నారి కనిపించకుండా పోయిన పన్నెండు గంటల తర్వాత మృతదేహాన్ని మున్సిపల్‌, అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read also: Adilabad Students: ప్రిన్సిపల్, వార్డన్ వేధిస్తున్నారు.. పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులు నిరసన..

మహారాష్ట్రకు చెందిన దంపతులు గత కొంతకాలంగా నగరంలోని ఆనందనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. భర్త సేల్స్‌మెన్‌గా పనిచేస్తుండగా, భార్య క్యాటరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరి చిన్న కూతురు బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటోంది. కొంతసేపటికి చిన్నారి కనిపించకుండా పోయింది. అమ్మమ్మ చెల్లెలు ఎక్కడుంటుందని ఆ చిన్నారి మనవడిని అడగ్గా.. మురుగు కాలువ వద్ద ఆడుకుంటోందని చెప్పాడు. అక్కడికి వెళ్లి చూడగా బాలిక కనిపించలేదు. అప్పుడు కాల్వలో మనవరాలు పడిపోయిందని పెద్దగా కేకలు వేసింది. కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. మున్సిపల్ కమిషనర్ మకరందు, అగ్నిమాపక స్టేషన్ అధికారి నర్సింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందితో కాల్వలో చిన్నారి కోసం పొక్లెయినర్‌ సహాయంతో వెతికడం మొదలపెట్టారు. దాదాపు 12 గంటల తర్వాత ఎట్టకేలకు ఈ ఉదయం మున్సిపల్ సిబ్బంది అతికష్టమ్మీద చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు.
Mallu Bhatti Vikramarka: మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి గుడ్ న్యూస్.. రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు..