- అచ్యుతాపురం ప్రమాదం చాలా బాధాకరం..
-
అచ్యుతాపురం ప్రమాదం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ కిందకు రాదు.. -
సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు మూసేస్తారనే భయం యజమానులలో ఉంది: పవన్

AP Deputy CM: అనకాపల్లి జిల్లాలోని అచుత్యాపురంలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. అనకాపల్లి ప్రమాదం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ కిందకు రాదు అని తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యంలో ఇద్దరు ఉన్నారు.. వారు కూడా బాధ్యత తీసుకోవటం లేదని చెప్పారు.. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలని నేను రాగానే చెప్పాను.. సేఫ్టీ ఆడిట్ అనగానే ఫ్యాక్టరీ యజమానులు భయపడుతున్న పరిస్థితి ఉంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కాగా, సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు మూసేస్తారనే భయం యజమానులలో ఉంది అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. పరిశ్రమల అవసరం ఉంది.. పరిశ్రమల్లో పని చేసే వారి ప్రాణ రక్షణ కూడా చాలా ముఖ్యం అని తెలిపారు. కాగా, ప్రధానంగా విశాఖపట్నంలో తరచుగా జరుగుతున్న ప్రమాదాలను తగ్గించటానికి సేఫ్టీ ఆడిట్ జరపాల్సిన అవసరం ఉంది.. తొందరలోనే పొల్యూషన్ ఆడిట్ ను చేపడతామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.