Leading News Portal in Telugu

Kolkata doctor case: గవర్నర్ ఆనంద బోస్ రాసిన రహస్య లేఖను తిరస్కరించిన సీఎంవో


  • గవర్నర్ ఆనంద బోస్ రాసిన రహస్య లేఖను తిరస్కరించిన సీఎంవో

  • బాధితురాలి తల్లిదండ్రులు చెప్పిన విషయాలను లేఖ ద్వారా పంపించిన గవర్నర్
Kolkata doctor case: గవర్నర్ ఆనంద బోస్ రాసిన రహస్య లేఖను తిరస్కరించిన సీఎంవో

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై గవర్నర్ సీవీ ఆనంద బోస్ పంపిన రహస్య లేఖను స్వీకరించేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కార్యాలయం తిరస్కరించిందని రాజ్‌భవన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. బుధవారం మహిళా వైద్యురాలి తల్లిదండ్రులను గవర్నర్‌ బోస్‌ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం మమతకు లేఖ రాస్తానని చెప్పారు. తల్లిదండ్రుల మనోభావాలను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. ‘‘నేను లేఖ రాసి సీల్డ్‌ కవర్‌లో సీఎంకు పంపుతాను.’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Kolkata doctor case: సుప్రీంకోర్టు విజ్ఞప్తికి స్పందించిన డాక్టర్లు.. సమ్మె విరమణ

లేఖలో బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడిన సంభాషణ ఉన్నట్లుగా తెలుస్తోంది. తల్లిదండ్రులు కొంత సమాచారాన్ని గవర్నర్‌కు తెలియజేసినట్లు సమాచారం. దీంతో ఈ విషయాలను ఉటంకిస్తూ అందులో పొందుపరిచారు. ఇదిలా ఉంటే గవర్నర్.. అంతకముందు బాధితురాలి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు.

ఇది కూడా చదవండి: Kolkata doctor case: సుప్రీంకోర్టు విజ్ఞప్తికి స్పందించిన డాక్టర్లు.. సమ్మె విరమణ

ఇదిలా ఉంటే వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కోల్‌కతా హైకోర్టు ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టారు. అయితే రంగంలోకి దిగకముందే క్రైమ్ సీన్ ఆనవాళ్లు చెరిపేసినట్లుగా గుర్తించారు. దీంతో దర్యాప్తు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి అండ్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ సహా ఈ కేసుతో సంబంధమున్న మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్‌ టెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. సీబీఐ చేసిన విజ్ఞప్తిని కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్‌ టెస్టుకు అనుమతి లభించింది.

ఇది కూడా చదవండి: Jyothi Rai: తుంటరి చూపుతో.. చుట్టమల్లే చుట్టేస్తోన్న జగతి ఆంటీ.. ఫొటోస్ చూశారా..

సీబీఐ విచారణలో సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం. ఇక ఘటన తర్వాత.. సందీప్ ఘోషే.. బాధిత కుటుంబానికి తప్పుడు సమాచారం ఇప్పించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఒక ప్రణాళిక ప్రకారం క్రైమ్ ఆఫ్ సీన్‌ కూడా మార్చేసినట్లుగా సీబీఐ అభిప్రాయపడుతుంది. సందీప్ ఘోష్‌తో సహా మరో నలుగురు వైద్యులు ఆయనతోనే ఉన్నట్లుగా సీబీఐ భావించింది. మరింత సమాచారం రాబట్టడం కోసం పాలిగ్రాఫ్‌ టెస్టుకు రెడీ అయింది. దీంతో కీలక సమాచారాన్ని సీబీఐ రాబట్టనుంది.

ఇక వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం నిరసన చేస్తున్న డాక్టర్లకు సూచించింది. కోర్టు విజ్ఞప్తి మేరకు డాక్టర్లు సమ్మె విరమించారు. మరోవైపు ఆర్జీ కర్ ఆస్పత్రి దగ్గర కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. గురువారం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై మండిపడింది. తీవ్రంగా ధ్వజమెత్తింది. అంతేకాకుండా బాధితురాలు దహన సంస్కారాలు పూర్తయ్యాక కేసు నమోదు చేయడంపై కూడా పోలీస్ యంత్రాంగంపై మండిపడింది.