Leading News Portal in Telugu

Ambati Rambabu: అచ్యుతాపురం ఘటన బాధాకరం.. మాపై నెట్టే ప్రయత్నం చేయొద్దు..!


  • అచ్యుతాపురం ఘటన బాధాకరం..

  • ప్రమాదాలు జరిగిన సమయంలో నెపం మాపై నెట్టే ప్రయత్నం..

  • ఇది దురదృష్టకరం అంటున్న అంబటి రాంబాబు..
Ambati Rambabu: అచ్యుతాపురం ఘటన బాధాకరం.. మాపై నెట్టే ప్రయత్నం చేయొద్దు..!

Ambati Rambabu: అచ్యుతాపురం ఘటన బాధాకరం అన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. కానీ, ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా నెపం మాపై నెట్టే ప్రయత్నం చేయటం దురదృష్టకరం అన్నారు.. ఇక, అచ్యుతాపురం ప్రమాదాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు లేదన్న ఆయన.. ప్రమాదానికి కారకులు ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలి తప్ప నిందలు వేయటం సరికాదు అన్నారు.. ప్రమాదాలు మా ప్రభుత్వంలో.. ఇప్పటి ప్రభుత్వంలో జరుగుతాయి.. అయితే, 2 గంటలకు ప్రమాదం జరిగితే 4 గంటలకు హోమ్ మంత్రి ప్రెస్ మీట్ పెట్టినా.. ప్రమాదం గురించి ప్రస్తావించలేదని విమర్శించారు.. మరోవైపు.. కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వటానికి చంద్రబాబు ఇబ్బంది పడ్డారు అని వ్యాఖ్యానించారు అంబటి.. నష్టపరిహారం కోటి ఇస్తేనే డెడ్ బాడీలు తీసుకెళ్తామని బాధితులు ఆందోళన చేయటం ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. చంద్రబాబుపై నమ్మకం లేకనే.. వారు ఇలా చేసి ఉంటారన్నారు.. మాటలు మార్చటం చంద్రబాబుకి అలవాటు.. కాబట్టి మళ్ళీ నష్టపరిహారం ఇవ్వకపోతే ఇబ్బంది కాబట్టి బాధితులు ఆందోళన చేసి ఉంటారని ఎద్దేవా చేశారు.. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టాల్సిన చర్యల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్‌ అయ్యిందని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..