- ఓ మహిళ తన భర్త అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో కూతురుని చంపింది.
- తమిళనాడు రాష్ట్రంలోని వడలూరులో ఈ దారుణ ఘటన.
- ఐదు నెలల పసికందును చంపి బావిలో పడేసింది.

Illegal Affair: ప్రస్తుత జీవిన కాలంలో కొంతమంది వివాహేతర సంబంధాల వైపు మొగ్గుచూపుతున్నారు. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కానీ.. పరాయి స్త్రీ లేదా పురుషులతో సంబంధాలను కొనసాగిస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాల వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో మీడియా పూర్వకంగా మనం చాలానే చూసే ఉన్నాము. ఇకపోతే తాజాగా తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన భర్త అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో కూతురుని చంపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు డిజిటల్ ‘రైట్స్’ కొనుగోలు చేసింది ఎవరంటే..?
తమిళనాడు రాష్ట్రంలోని వడలూరులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడు అనే ఆలోచనతో అతడిని అడ్డు తొలగించుకోవాలనని ఆమె తన ఐదు నెలల పసికందును చంపి బావిలో పడేసింది. నిందితురాలు రాజేశ్వరి గత కొద్ది కాలంగా భర్త నుండి విడిపోయి దూరంగా నివసిస్తుంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరొక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన అక్రమ సంబంధానికి తన భర్త అడ్డుగా ఉండడంతో తన కుమార్తెను చంపి భర్త తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది కిలాడి మహిళ. అయితే., కేసులో విచారణలో భాగంగా కిడ్నాప్ ఆయన చిన్నారి కోసం భర్తను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. వారికి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ విచారణలో తన భార్య తనను అడ్డు తొలగించుకోవాలనే క్రమంలో తన కూతురిని చంపి బావిలో పడేసిందని తాను కిడ్నాప్ చేసినట్టుగా డ్రామాలు చేస్తున్నట్లుగా పోలీసులకు తెలపడంతో.. అసలు విషయాన్ని పోలీసులు తెలుసుకోగలిగారు. దీంతో కిలాడి లేడీ రాజేశ్వరిని పోలీసులు అరెస్టు చేసి బావిలో పడేసిన పసికందు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Raayan OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రాయన్’.. ఎక్కడ చూడొచ్చంటే..?