- ప్రశ్న అడిగిన పాపానికి మహిళా జర్నలిస్ట్ చెంపపై కొట్టిన రాజకీయ నేత
-
ఘటనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన మాజీ ఉప ప్రధాని వోంగ్సువాన్

థాయ్‌లాండ్‌లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఆర్మీ చీఫ్ ప్రవిత్ వోంగ్సువాన్ మహిళా జర్నలిస్టు పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ప్రశ్న అడిగినందుకు మహిళా రిపోర్టర్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో థాయ్‌లాండ్ పార్లమెంట్ సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Good Pressure: ఇది “మంచి ఒత్తిడి” గురూ… దాని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఇటీవలే అతి పిన్న వయసులో కొత్త ప్రధాన మంత్రిగా పేటోంగ్టార్న్ షినవత్రా ఎంపికయ్యారు. ఇదే అంశంపై మహిళా జర్నలిస్టు.. పలాంగ్ ప్రచారత్ పార్టీ (PPRP) నాయకుడు ప్రవిత్ వోంగ్సువాన్(79)ను ప్రశ్న అడిగింది. దీంతో ఒక్కసారిగా అతడు రెచ్చిపోయి.. జర్నలిస్టు చెంపపై కొట్టాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయాలని బాధితురాలికి థాయ్ పార్లమెంట్ పేర్కొంది. అలాగే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు థాయ్ పార్లమెంట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే తనకు మహిళా జర్నలిస్టు బాగా తెలుసని.. ఆట పట్టించడానికే అలా చేసినట్లు ప్రవిత్ వాంగ్సువాన్ చెప్పుకొచ్చారు. ఆమె పట్ల ఎలాంటి చెడు ఉద్దేశంలేదని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై వాంగ్సువాన్ క్షమాపణలు చెప్పారని PPRP పార్టీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ప్రభుత్వ సభలో OG నినాదాలు.. పవన్ షాకింగ్ కామెంట్స్
వాంగ్సువాన్ 2000లో థాయ్‌లాండ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. 2014లో అప్పటి ప్రధాని యింగ్లక్ షినవత్రాను తొలగించిన తిరుగుబాటు నేతల్లో ఇతడు ఒకడు. మిలటరీ మద్దతుతో గత ఏడాది వరకు పాలించిన ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా కూడా ఇతడు పనిచేశాడు.
ఇక రిపోర్టర్ అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత చెంపదెబ్బపై దర్యాప్తు చేస్తామని థాయ్ పార్లమెంట్ తెలిపింది. థాయ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కూడా ఈ ఘటనను ఖండించింది. అతని చర్యలు పత్రికా హక్కులు, స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయని అని పేర్కొంది. థాయ్‌పిబిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నొప్పాడోల్ శ్రీహతై మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల చర్యలు జర్నలిజానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయని అన్నారు. రిపోర్టర్‌ను బాధపెట్టేలా వ్యవహరించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
A politician is surrounded by journalists while walking down a corridor when one of them asks him a question.
■ Instead of answering it, he raises his hand and slaps her in the head several times before climbing into his vehicle and driving away.
■ Videos of this interaction in… pic.twitter.com/WjYw7CZtWa— Stephen Mutoro (@smutoro) August 21, 2024