Leading News Portal in Telugu

Sakhahari: తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్.. ఎక్కడ? ఎప్పుడు చూడాలంటే?


Sakhahari: తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్.. ఎక్కడ? ఎప్పుడు చూడాలంటే?

Shakhahaari Movie to Stream in Aha Telugu from 24th August: కన్నడలో బ్లాక్ బస్టర్ అయినా శాకాహారి చిత్ర తెలుగు అనువాద హక్కులను హనుమాన్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మాత బాలు చరణ్ మంచి రేట్ కి దక్కించుకున్నారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండాలి అని డబ్బింగ్ విషయంలో కేర్ తీసుకుని తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు అయిన గోపరాజు రమణ చేత హీరో క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పించడంతో ఇప్పుడు ఈ శాకాహారి సినిమా మన తెలుగు సినిమాలా ఉంటుందని నిర్మాత చెబుతున్నారు. గోపరాజు రమణ డబ్బింగ్ వెర్షన్ కేవలం ఆహా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుందని చెబుతున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నా గోపరాజు రమణ వాయిస్ తో ఇప్పుడు ఆహాలో రిలీజ్ చేయనున్నారు.

Indra 4K: బద్దలు కొడుతుంది అనుకుంటే ‘మురారి’ని టచ్ చేయలేదుగా!

సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో రంగాయన రఘు ప్రధాన పాత్ర పోచించారు. ఇది ఒక మర్డర్ మిస్టరీ కథ కాగా గోపాలకృష్ణ దేశ్ పాండే .. వినయ్ .. నిధి హెగ్డే .. హరిణి శ్రీకాంత్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. మయూరి అంబేకల్లు అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పొచ్చు. మంచి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఆదరించే వారికీ ఈ శాకాహారి చిత్రం మంచి విందు భోజనం అవుతుందని అంటున్నారు నిర్మాతలు. సినిమా మొదలు నుంచి చివరి వరకు మంచి సస్పెన్స్ అంశాలతో చిత్రీకరించారు దర్శకుడు. ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుందని రానున్నారు. ఇక ఈ సినిమా ఆగష్టు 24 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.