Leading News Portal in Telugu

CM Revatnh Reddy: అదాని కుంభకోణంపై నేడు సీఎం రేవంత్ ధర్నా.. భారీ ప్రదర్శన..


  • ఆధాని మెగా కుంభకోణం పై విచారణ జరపాలి..

  • సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలి- సెబీ చైర్మన్ రాజీనామా చేయాలి..

  • దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన..
CM Revatnh Reddy: అదాని కుంభకోణంపై నేడు సీఎం రేవంత్ ధర్నా.. భారీ ప్రదర్శన..

CM Revanth Reddy: ఇవాళ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదుట.. గన్ పార్క్ నుంచి ఈడి కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ఈడి కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టారు. సీఎం వెంట ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొననున్నారు. ఆధాని మెగా కుంభకోణం పై విచారణ జరపాలని, సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలి, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో ఈ ఆందోళన కొనసాగనుంది. అనంతరం ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి సెక్రెటేరియట్​ చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు సీఎంవో అధికారులతో బ్రీఫింగ్​ పై చర్చించనున్నారు.

Read also: CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా హస్తినకు వెళ్లే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ముఖ్య అతిధులుగా రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసినందుకు గాను వరంగల్‌లో నిర్వహించనున్న రైతు అభినందన సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్ నేతల రాకను నిర్ధారించుకున్న తర్వాతే కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని సమాచారం.
BRS Dharna: నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు.. చేవెళ్లలో కేటీఆర్‌, ఆలేరులో హరీష్‌ రావు..