- మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఏపీ మహిళ గల్లంతు..
-
ఫుట్ పాత్‌పై నడుస్తుండగా కుంగిపోయి మురికికాలువలో గల్లంతైన మహిళ..

Woman swallowed by sinkhole in Malaysia: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ గల్లంతు అయ్యింది.. ఫుట్ పాత్‌పై అందరిలాగే సదరు మహిళ నడుకుంటూ వెళ్తుండగా.. ఒక్కసారిగా ఫుట్‌పాత్ కుంగిపోయింది.. దీంతో.. ఆమె మురికికాలువలో పడి గల్లంతైంది.. అక్కడున్నవారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఈ ప్రమాదంలో కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మీ(45) గల్లంతయ్యారు.. ఫుట్ పాత్ పై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుంగడంతో 10 మీటర్ల లోతెన మురికికాల్వలో పడిపోయారు మహిళ.. విజయలక్ష్మి (45) తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తున్నారు.. మరోవైపు.. మలేషియాలో మహిళ గల్లంతుపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.. ఆ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటూ, గాలింపు చర్యలు పగడ్బందీగా జరిగేలా చూడాలని APNRT అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.