- వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..
-
జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అంచనాలు వేయడం కష్టం.. -
విశాఖప రాజధాని పేరు చెప్పి 500 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకున్నాడు.. -
రాజధానికి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదన్న వీర్రాజు..

Somu Veerraju: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సోము వీర్రాజు.. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అంచనాలు వేయడం కష్టం అన్నారు.. విశాఖపట్నం రాజధాని పేరు చెప్పి 500 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకున్నాడు.. తప్ప రాజధానికి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఈ పరిస్థితులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుందని వెల్లడించారు.. ఇక, ప్రపంచ దేశాలను ఆ ఆకర్షిస్తున్న విశాఖలో ఫార్మా ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరగడం ఆందోళనకరం అన్నారు.. శ్రీకాకుళంలో విశాఖ కంటే ముందే ఫార్మా ఇండస్ట్రీలు ఏర్పాటు అయినా.. విశాఖలోనే ఎందుకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.. ఇప్పటికైనా ఈ ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పంచాయితీ నిధులను గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు సోము వీర్రాజు.