- ప్రస్తుతం జైల్లో నిందితుడు సంజయ్ రాయ్
- నిన్న రాత్రి మటన్..రోటీ తిన్నట్లు సమాచారం
- ఆగ్రహానికి గురవుతున్న ప్రజలు
- నిందితుడిని వెంటనే ఉరితీయాలని డిమాండ్

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. సంజయ్ రాయ్ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలులో సెల్ నంబర్ 21లో ఉన్నాడు. అయితే అతడికి సంబంధించిన ఓ సమాచారం బయటకు వచ్చింది. సంజయ్ రాయ్ నిన్న రాత్రి జైలులో మటన్, రోటీ తిన్నాడని సమాచారం. ఇది తెలుసుకున్న పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిందితుడిని జైల్లో కూర్చోబెట్టి మేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ ఘటనకు కారణమైన సంజయ్ రాయ్ ని వెంటనే ఉరి తీయాలని లేదా ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
READ MORE: Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు
కాగా.. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష ప్రారంభమైంది. కోల్‌కతా లోని సీబీఐ కార్యాలయంలో నిందితుడు సంజయ్ రాయ్, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, ఘటన జరిగిన రాత్రి బాధితురాలితోపాటు నలుగురు వైద్యులను.. అలాగే, ఒక వాలంటీర్ లకు పాలిగ్రాఫ్ పరీక్షలు చేపడుతున్నారు. ఇకపోతే నిందితులు నిజాన్ని బయటపెట్టడానికి, పోలీసులు పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహిస్తారు. దీనిలో లై డిటెక్టర్ యంత్రం ద్వారా అబద్ధాలను గుర్తించే ప్రయత్నం చేస్తారు. ఇందులో నిందితుడి సమాధానం సమయంలో శరీరంలో సంభవించే మార్పుల ద్వారా, నిందితుడు ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇస్తున్నాడా లేదా అనేది నిర్ధారించబడుతుంది. ఈ పరీక్షలో నిందితుల శారీరక మార్పులని జాగ్రత్తగా స్టడీ చేసి, వారి ప్రతిచర్యను బట్టి సమాధానం నిజమో.. అబద్ధమో.. నిర్ణయించబడుతుంది