
మహిళపై పోలీసుల పక్షపాత వైఖరిని ఖండిస్తున్నామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ప్రతి పక్ష పోషిస్తున్నారా అర్థం కాట్లేదని, మమ్ముల్ని జుట్టు పట్టుకుని బూట్లతో తన్నారని ఆమె ఆరోపించారు. సీపీ విచారణ చేసి యూనిఫాం వేసుకున్న దొంగ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు బ్రేక్ డాన్స్ లు వేస్తారన్న కేటీఆర్ ఇంట్లో కూడా బ్రేక్ డాన్స్ లు వేస్తున్నారా అని ఆమె మండిపడ్డారు. కేటీఆర్ కల్చర్ బ్రేక్ డాన్స్ కల్చర్,పబ్ ల కల్చర్ అని ఆమె విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ను చూస్తే మహిళలు తల దించుకొని పోతరని, కేటీఆర్ మహిళలపై కించపరిచే విధంగా మాట్లాడిండు అని ఆమె మండిపడ్డారు.
Somu Veerraju: సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. జగన్ ఆలోచనలు అంచనా వేయలేం..!
అందుకే మేము బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ని ఆడిగామన్నారు సునీతారావు. కేటీఆర్ బస్ ఎక్కి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పక పోతే ఆయనను తిరగనియ్యమని ఆమె అన్నారు. కేటీఆర్ అడ్డ మీద కూలోళ్ళతోటి మా మహిళలపై దాడి చేయించాడని, మా మహిళ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి, వేలు విరిగిందన్నారు. కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని, మహిళ కమిషన్ కేటీఆర్ పై సుమోటో గా తీసుకొని కేసు పెట్టాలన్నారు. కేటీఆర్ అన్ని పార్టీల మహిళలకు క్షమాప చెప్పాలన్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా పోతదని ఆమె వ్యాఖ్యానించారు.
Kolkata Doctor Murder Case: ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో మరో 6 మందికి పాలిగ్రఫీ పరీక్షలు..