Leading News Portal in Telugu

Andhra Pradesh: బదిలీలకు గైడ్ లైన్స్ జారీ చేస్తున్న వివిధ శాఖలు


  • ఏపీలో బదిలీలకి గైడ్ లైన్స్ జారీ చేస్తున్న వివిధ శాఖలు
  • రవాణ శాఖలో రెండేళ్లకే స్థాన చలనం ఉండేలా గైడ్ లైన్స్ జారీ
  • త్వరలోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకూ గైడ్ లైన్స్
Andhra Pradesh: బదిలీలకు గైడ్ లైన్స్ జారీ చేస్తున్న వివిధ శాఖలు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ శాఖలు ఉద్యోగుల బదిలీలకు గైడ్‌లైన్స్ జారీ చేస్తున్నాయి. రవాణ శాఖలో రెండేళ్లకే స్థాన చలనం ఉండేలా గైడ్ లైన్స్ జారీ అయ్యాయి. రవాణా శాఖలోని ఉద్యోగ సంఘాలు ఏవీ కోరకుండానే బదిలీల్లో గైడ్ లైన్స్ జారీ అయినట్లు తెలిసింది. కొందరు మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల లాబీయింగులతోనే బదిలీ నిబంధనల సడలింపు అని విమర్శలు కూడా వస్తున్నట్లు సమాచారం.

మరో వైపు జనరల్ గైడ్ లైన్స్ ప్రకారమే శాఖాపరంగా బదిలీల గైడ్ లైన్స్ రూపొందించామని రవాణ శాఖ అంటోంది. రెండేళ్ల కిందటే రవాణా శాఖలో పెద్దఎత్తున బదిలీలు జరిగాయని అధికారులు అంటున్నారు. త్వరలోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకూ గైడ్ లైన్స్‌ను జారీ చేయనున్నారు అధికారులు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో కూడా రెండేళ్లకే పెట్టాలా..? లేక జనరల్ గైడ్ లైన్స్ వర్తింప చేయాలా..? అనే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలోనూ బదిలీల ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.