- మధురానగర్లో విషాదం
- దొంగను చంపిన పండ్ల వ్యాపారి
- పలుమార్లు దొంగతనం చేసిన దొంగ

హైదరాబాద్ నగరంలోని మధురానగర్లో విషాదం చోటుచేసుకుంది. తన షాపులో పలుమార్లు దొంగతనం చేశాడని ఓ యువకుడిని పండ్ల వ్యాపారి కొట్టిచంపాడు. పండ్ల వ్యాపారి దెబ్బలకి నడిరోడ్డుపైనే దొంగ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.
మధురానగర్లోని ఓ పండ్ల షాపులో ఓ యువకుడు పలుమార్లు దొంగతనం చేశాడు. గల్లా పెట్టెలో ఉన్న డబ్బులను అతడు కాజేశాడు. దాంతో పండ్ల వ్యాపారి ఆ దొంగపై నిఘా వేశాడు. యువకుడు శనివారం దొంగతనం చేస్తుండగా.. పండ్ల వ్యాపారి అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆపై దొంగపై ఇనుపరాడుతో పండ్ల వ్యాపారి విచక్షణ రహితంగా దాడి చేశాడు. పండ్ల వ్యాపారి దెబ్బలకి ఆ యువకుడు నడిరోడ్డుపైనే మృతి చెందాడు.