Leading News Portal in Telugu

Anakapalli Dist: ఏపీ స్పీకర్ ఇంటి ఇలవేల్పు ఆలయంలో నగలు మాయం..


  • నర్సీపట్నంలోని మరిడి మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో నగలు మాయం..

  • ఆలయంలో అమ్మవారి బంగారు హారం స్థానంలో గిల్టు నగలు గుర్తింపు..

  • నకిలీ వ్యవహారంలో ఈవోపై చర్యలకు దేవాదాయశాఖ ఆదేశాలు..

  • పాలకవర్గం మార్పు సమయంలో నగలను పరిశీలిస్తుండగా బయటపడ్డ వ్యవహారం..
Anakapalli Dist: ఏపీ స్పీకర్ ఇంటి ఇలవేల్పు ఆలయంలో నగలు మాయం..

Anakapalli Dist: అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంటి ఇలవేల్పు ఆలయంలో బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. మరిడి మహా లక్ష్మీ అమ్మవారి బంగారు హారం స్థానంలో గిల్టు నగను దేవాదాయశాఖ అధికారులు గుర్తించారు. మార్చి 19వ తేదీన 390 గ్రాముల హారం దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో అప్పగించిన ట్రస్టీ చింతకాయల సన్యాసి పాత్రుడు.. నకిలీ హారం వెలుగులోకి రావడంతో ఈవోపై క్రిమినల్ చర్యలకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబానికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. పాలక వర్గం చేతులు మారే ముందు ఆభరణాల నాణ్యతను పరిశీలిస్తే గిల్టు నగల వ్యవహారం బయటకు వచ్చింది. కాగా, ఈ ఘటనపై పోలీసులకు దేవాదాయ శాఖ కంప్లైంట్ ఇచ్చింది. ఇక, ఈ నగలీ నగల వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.