
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బిజెపి) సోమవారం తన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి దశకు 15 మంది అభ్యర్థులు, రెండో దశకు 10 మంది అభ్యర్థులు, మూడో దశ ఓటింగ్‌కు 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
మొత్తం 44 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. రాజ్‌పోరా నుంచి అర్షిద్ భట్, షోపియాన్ నుంచి జావేద్ అహ్మద్ ఖాద్రీ, అనంత్‌నాగ్ వెస్ట్ నుంచి మహ్మద్ రఫీక్ వానీలను పార్టీ బరిలోకి దించింది. అనంతనాగ్ నుండి న్యాయవాది సయ్యద్ వజాహత్, కిష్త్వార్ నుండి శ్రీమతి షగున్ పరిహార్, దోడా నుండి గజయ్ సింగ్ రాణా పోటీ చేయనున్నారు. ఆదివారం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. 2024లో జరగనున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఎన్నికల సంఘం ఆమోదించింది.
బీజేపీ తొలి జాబితాలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మాజీ డిప్యూటీ సీఎం, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ నిర్మల్ సింగ్‌కు టికెట్ దక్కకపోవడం ఆశ్చర్యకరం. నిర్మల్ సింగ్ 2014లో బిల్వార్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. అదే సమయంలో కవీందర్ గుప్తాకు కూడా టిక్కెట్ దక్కలేదు. అయితే తదుపరి జాబితాలో కవీందర్ గుప్తా పేరును ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టిక్కెట్లు పొందిన వారు..
రాజ్‌పోరా: అర్షిద్ భట్
షోపియాన్: జావేద్ అహ్మద్ ఖాద్రీ
అనంతనాగ్ వెస్ట్: మహ్మద్ రఫీక్ వానీ
అనంతనాగ్: సయ్యద్ వజాహత్
కిష్త్వార్: శ్రీమతి షగున్ పరిహార్
దోడా: గజయ్ సింగ్ రాణా
రీసి: కుల్దీప్ రాజ్ దూబే
శ్రీ మాతా వైష్ణో దేవి: రోహిత్ దూబే
పూంచ్ హవేలీ: చౌదరి అబ్దుల్ ఘని
ఉధన్‌పూర్ వెస్ట్: పవన్ గుప్తా
రామ్‌గఢ్ (SC): డాక్టర్ దేవిందర్ కుమార్ మణియల్
అఖ్నూర్: మోహన్ లాల్ భగత్
BJP releases a list of 44 candidates for the upcoming Jammu & Kashmir assembly elections
Arshid Bhat to contest from Rajpora, Javed Ahmad Qadri to contest from Shopian, Mohd. Rafiq Wani to contest from Anantnag West. Adv. Syed Wazahat to contest from Anantnag, Sushri Shagun… pic.twitter.com/s7dXVe8Fdm
— ANI (@ANI) August 26, 2024