Leading News Portal in Telugu

Viral Video: మరి ఇంత కోపమా.. అంపైర్‌ అవుట్ ఇచ్చాడని.. హెల్మెట్‌ తో ఏకంగా.?


  • క్రికెట్ మ్యాచ్ లలో వివిధ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్.
  • సోషల్ మీడియాలో వైరల్ వీడియో.
  • బ్రాత్ వైట్ కోపోద్రికుడై బ్యాటితో హెల్మెట్ ని బలంగా కొట్టాడు.

Viral Video: మరి ఇంత కోపమా.. అంపైర్‌ అవుట్ ఇచ్చాడని.. హెల్మెట్‌ తో ఏకంగా.?

Viral Video: ఈ మధ్యకాలంలో క్రికెట్ మ్యాచ్ లలో వివిధ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాము. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వివిధ లీగులు జరుగుతుంటాయి. ఇందులో వెస్టిండీస్ లో జరిగే Max60 కరీబియన్ లీగ్ ఒకటి. ప్రస్తుతం ఈ లీగ్ ముగింపు దశలో ఉంది. సూపర్ 3 రౌండ్ మ్యాచ్ లో భాగంగా తాజాగా న్యూయార్క్ స్ట్రైకర్స్, గ్రాండ్ కేమన్ జాగ్వర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు కార్లస్ బ్రాత్ వైట్ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ స్ట్రైకర్స్ టీం తరఫున ఆడుతున్న డ్రాఫ్ట్ వైట్ కోపంతో బంతికి బదులుగా తన హెల్మెట్ ను బ్యాట్ తో హెల్మెట్ కాస్త బౌండరీ లైన్ అవతల పడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Breaking News: బైక్ పై కూతురితో వెళ్తుండగా ఎస్సైను గుద్దిన టెంపో..బాలిక మృతి

వైరల్ గా మారిన వీడియోలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ కార్లస్ బ్రాత్ వైట్ గ్రాండ్ కేమెన్ జాగ్వర్ జోష్ లిటిల్ చేతిలో కీపర్ క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు. అయితే., బ్రాత్ వైట్ బాటకు ఆ బాలు తగల్లేదు. అయినా కాని బ్రాత్ వైట్ ను అంపైర్ అవుట్ గా ప్రకటించేశాడు. దీంతో బ్రాత్ వైట్ కోపోద్రికుడై బ్యాటితో హెల్మెట్ ని బలంగా కొట్టాడు. దీంతో ఆ హెల్మెట్ కాస్త బౌండరీన్ లైన్ అవతల పడింది. ఇకపోతే బ్రాత్ వైట్ 2016 టి20 వెస్టిండీస్ లో ఛాంపియన్ గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు. బ్రాత్ వైట్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో వెస్టిండీస్ తరఫున మూడు టెస్టులు, 41 టి20 లు, 44 వన్డేలు ఆడాడు.