Leading News Portal in Telugu

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..


  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

  • శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..

  • శ్రీవారి భక్తులకు ఇబ్బంది కలగకుండా..టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట టీబీసీ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) అధికారులు పేర్కొన్నారు. కాగా, సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా.. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని తెలిపింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. స్వామి వారి దర్శానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న (ఆదివారం) 84,060 మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకోగా.. అందులో 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.01 కోట్ల రూపాయలుగా లెక్క తేలింది.