- విజయనగరం: నెల్లిమర్ల ఈవీఎం గోదాముల తాళాలు మిస్సింగ్..
-
తాళాలు కనిపించడం లేదని 2 గంటలుగా అధికారుల తర్జనభర్జన.. -
ఈవీఎంల గోదాం తాళాలు లేకపోవడంతో సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం..

Vizianagaram: విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల ఈవీఎం గోదాము తాళాలు మిస్స్ అయ్యాయి. రెండు గంటలగా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మాజీ ఎంపీ బెల్లాన, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య ఈవీఎంలపై ఫిర్యాదు మేరకు నేడు విచారణకు సిద్దమైన అధికారులు.. విచారణలో భాగంగా గోదాం యొక్క తలుపులు తెరిచేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వచ్చారు. ఈవీఎం బాక్సుల తాళాలు లేకపోవడంతో సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, గజపతి నగరం నియోజకవర్గం ఈవీఎం గోదాం తాళాలు ఆర్డీవో దగ్గర ఉన్నాయంటూ అధికారులు జాప్యం చేస్తున్న వైనం నెలకొంది. తలుపు పగలగొట్టి చూపిస్తామంటూ ఫిర్యాదు దారులను అధికారులు సమదాయిస్తున్నారు. ఈవీఎంలు ఉన్న గోదాం తాళాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గోదాం తాళాలు లేకపోతే సదరు అధికారులపై తక్షణ చర్యలు తీసుకుంటాను అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హెచ్చరికలు జారీ చేశారు.