Leading News Portal in Telugu

Husband Kills Wife: డంబుల్స్తో భార్యను కొట్టి చంపిన భర్త.. కారణమిదే..?


  • తూర్పుగోదావరి జిల్లా పాత ఊరిలో భార్యను హత్య చేసిన భర్త

  • భార్యపై అనుమానంతో తలపై డంపుల్స్ తో కొట్టి హతమార్చిన భర్త

  • వీరికి ఇద్దరు ఆడపిల్లల సంతానం.
Husband Kills Wife: డంబుల్స్తో భార్యను కొట్టి చంపిన భర్త.. కారణమిదే..?

అనుమానం ఒకరి ప్రాణం తీసింది. సంసార జీవితంలో సంతోషంగా జీవించాల్సిన వాళ్లు.. అనుమానం అనే పెనుభూతం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలా.. వారి చావుతో తమ కుటుంబం ఒంటరై పోతుంది. అనుమానం అనే సమస్యతో ఎందరో మంది ప్రాణాలు తీయడం, తీసుకోవడం జరుగుతూనే ఉంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అమానుషంగా ప్రవర్తించాడు. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తే ఆమెపాలిట కాలయముడై భార్యను అతి కిరాతకంగా చంపాడు. తాజాగా.. ఇలాంటి ఘటన ఏపీలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త దారుణాంగా హత్య చేశాడు.

Janmashtami 2024: కోపం మనిషిని ఎలా దిగజారుస్తుంది?.. భగవద్గీతలోని ఈ శ్లోకం చదివి తెలుసుకోండి

వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పాత ఊరిలో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. భార్యపై అనుమానంతో తలపై డంపుల్స్ తో కొట్టి హతమార్చాడు. నిందితుడు తుపాకుల సాయిగా గుర్తించారు. కాగా.. మృతురాలు తుపాకుల అరుణకుమారి. అయితే.. వీరి స్వస్థలం బొబ్బిలి. పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం అనపర్తి వచ్చి బతుకుతున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లల సంతానం కూడా ఉంది. కాగా.. తన తల్లి మరణంతో పిల్లలు తీవ్రంగా రోధిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి పరిశీలించారు. అనంతరం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 మంది స్టార్ క్యాంపెయినర్లు.. జాబితా విడుదల చేసిన బీజేపీ