- మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కొత్త షెడ్యూల్ విడుదల
-
అక్టోబర్ 3 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో టోర్నీ ప్రారంభం -
అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ -
తొలి మ్యాచ్‌లో తలపడనున్న బంగ్లాదేశ్.. స్కాట్లాండ్ జట్లు.

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కొత్త షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో టోర్నీ ప్రారంభం కానుంది. కాగా.. ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరగనుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. టీ20 ప్రపంచకప్‌ను ముందుగా బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉండగా.. ప్రతికూల రాజకీయ పరిస్థితుల కారణంగా టోర్నీని యూఏఈకి మార్చాల్సి వచ్చింది. అయితే.. టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించడం అధికారికంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వద్ద ఉంది.
Demand Courses: ఈ కోర్సులకు భారీగా డిమాండ్.. లక్షల్లో జీతాలు?
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ఇండియా, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు గ్రూప్ ‘A’లో ఉంటాయి. ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మరియు దక్షిణాఫ్రికా గ్రూప్ ‘B’లో ఉన్నాయి. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో జరిగే టోర్నీలో భారత్ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. అక్టోబరు 9న శ్రీలంకతో మూడో మ్యాచ్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత అక్టోబర్ 13న చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Maharashtra: కూలిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం.. గతేడాది మోడీ ఆవిష్కరణ