- CMRF స్కాం పై 6 కేసులు నమోదు.
- వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు సృష్టించాయి ఆసుపత్రులు.
- 28 ఆసుపత్రుల పైన కేసులు నమోదు.

CMRF Scam: తాజాగా CMRF స్కాం పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు సృష్టించాయి ఆసుపత్రులు. ఈ నేపథ్యంలో 28 ఆసుపత్రుల పైన కేసులు నమోదు చేసింది సిఐడి. ఈ కేసులో హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. 30 ఆస్పత్రులు నకిలీ పిల్లలతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసారని ఆరోపణలు వచ్చాయి. 30 ఆసుపత్రులు కలిసి వందల కోట్ల రూపాయల సీఎంఆర్ నిధులు స్వాహా చేశారని నిర్ధారణ జరిగింది. ఆస్పత్రి సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేసారని విచారణలో వెలుగు చూసారు అధికారులు. సచివాలయంలోని సిఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసింది సిఐడి. దింతో 30 ఆసుపత్రులపై విచారణ ముమ్మరం చేసారు సిఐడి అధికారులు.
ఇక ఈ కేసులో 28 ఆసుపత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాదులో..
* అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్;
* శ్రీ కృష్ణ హాస్పిటల్, సైదాబాద్; జనని హాస్పిటల్, సైదాబాద్;
* హిరణ్యా హాస్పిటల్, మీర్పేట్; డెల్టా హాస్పిటల్, హస్తినాపురం;
* శ్రీ రక్షా హాస్పిటల్, బిఎన్ రెడ్డి నగర్;
* ఎంఎంఎస్ హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్;
* ఎడిఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శారదానగర్;
* ఎంఎంవి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట;
* శ్రీ సాయి తిరుమల హాస్పిటల్, బైరామల్ గూడ
ఖమ్మం:
* శ్రీ శ్రీకర మల్టీస్పెషాలిటీ హాస్పిటల్
* గ్లోబల్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్
* డా. J.R. ప్రసాద్ హాస్పిటల్
* శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
* శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
* వైష్ణవి హాస్పిటల్
* సుజాత హాస్పిటల్
* న్యూ అమృత హాస్పిటల్
* ఆరెంజ్ హాస్పిటల్
* మెగశ్రీ హాస్పిటల్, బోనకల్
నల్గొండః
* నవీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మిర్యాలగూడ.
* మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మిర్యాలగూడ.
* అమ్మ హాస్పిటల్, రైల్వే స్టేషన్ రోడ్.
కరీంనగర్:
* సప్తగిరి ఆసుపత్రి, జమ్మికుంట
* శ్రీ సాయి ఆసుపత్రి, పెద్దపల్లి
వరంగల్:
* రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్., హనుమకొండ
మహబూబాబాద్:
* శ్రీ సంజీవిని హాస్పిటల్
* సిద్ధార్థ హాస్పిటల్.