Leading News Portal in Telugu

iphone 16 Launch: ఐఫోన్‌ 16 సిరీస్‌ లాంచ్ డేట్ వచ్చేసింది.. యాపిల్‌ ప్రియులకు పండగే ఇగ!


  • యాపిల్‌ ప్రియులకు శుభవార్త
  • ఐఫోన్‌ 16 సిరీస్‌ లాంచ్ డేట్ వచ్చేసింది
  • టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా యాపిల్‌ ఇంటెలిజెన్స్‌
iphone 16 Launch: ఐఫోన్‌ 16 సిరీస్‌ లాంచ్ డేట్ వచ్చేసింది.. యాపిల్‌ ప్రియులకు పండగే ఇగ!

Apple iphone 16 Launch Event Date: ‘యాపిల్‌’ ప్రియులకు శుభవార్త. 2024 యాపిల్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. సెప్టెంబర్‌ 9న ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు యాపిల్‌ అధికారికంగా ప్రకటించింది. కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి యాపిల్‌ కంపెనీ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ రెండో వారంలో యాపిల్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈసారి సెప్టెంబర్‌ 10న ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఒకరోజు ముందుగానే యాపిల్‌ ఈవెంట్‌ డేట్‌ను ప్రకటించింది.

కాలిఫోర్నియాలోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో యాపిల్‌ తన ఈవెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఈవెంట్‌ యాపిల్‌ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఆరంభం అవుతుంది. యాపిల్‌ ఈవెంట్‌ ట్యాగ్‌ లైన్‌ను ‘ఇట్స్‌ గ్లోటైమ్‌’గా పేర్కొంది. యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

యాపిల్‌ వెంట్‌లో ఐఫోన్‌ 16 సిరీస్‌, యాపిల్‌ వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌ ప్రొడక్ట్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. వీటితో పాటుగా కొత్త హార్డ్‌వేర్‌ను ప్రకటించనుంది. ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో రానున్నట్లు సమాచారం. నాలుగు మోడళ్లు ఐఫోన్‌ 16, ఐఫోన్‌ ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మాక్స్‌లను ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి అన్ని మోడళ్లలో యాక్షన్‌ బటన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో 15 సిరీస్ ప్రో మోడల్స్‌లో మాత్రమే ఈ యాక్షన్‌ బటన్‌ను ఇచ్చారు. ఈ సారి అన్నిమోడళ్లు లేటెస్ట్‌ జెన్‌ హార్డ్‌వేర్‌, ఏఐతో రానున్నాయి.