Leading News Portal in Telugu

Telangana Governor: నేడు ములుగు, భూపాలపల్లిల్లో రాష్ట్ర గవర్నర్ పర్యటన


  • నేడు ములుగు- భూపాలపల్లి జిల్లాల్లో రాష్ట్ర గవర్నర్ పర్యటన..

  • రాత్రి లక్నవరంలో బస చేయనున్న గవర్నర్ జిష్ణుదేవవర్మ..
Telangana Governor: నేడు ములుగు, భూపాలపల్లిల్లో రాష్ట్ర గవర్నర్ పర్యటన

Telangana Governor: తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్‌ వర్మ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నేటి నుంచి మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ పర్యటించనున్నారు. రాత్రి లక్నవరంలో బస చేయనున్నారు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు రోడ్డు మార్గంలో ములుగుకు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ అతిథి గృహంలో అరగంట పాటు బస చేయనున్నారు. అనంతరం మధ్నాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా అధికారులను పరిచయం చేసుకోనున్నారు.

Read also: MLC Kavitha: నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..

ఇక ఒంటి గంట నుంచి మధ్నాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్ లో 25 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన రచయితలు, కళాకారులతో సమావేశమై మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. ఇక 3 గంటలకు రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. సరస్సును సందర్శించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లను సందర్శించి పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి 6:30 గంటలకు లక్నవరం సరస్సు వద్ద ఉన్న హరిత రిసార్ట్ కు చేరుకొని రాత్రి అక్కడ బస చేయనున్నారు.

Read also: Adilabad Agency: నేడు ఆదిలాబాద్ ఏజెన్సీ బంద్..

రేపు (28)న హనుమకొండలో పేరొందిన కళాకారులు, ప్రముఖులతో సమావేశం కానున్నారు. అనంతరం వరంగల్ ఖిల్లాను, భద్రకాళీ, వేయిస్తంభాల ఆలయాలను సందర్శిస్తారు. రాత్రి వరంగల్ నిట్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఎల్లుండి (29)న మూడో రోజు జనగామ జిల్లాలో కవులు, కళాకారులతో సమావేశమై అక్కడి నుంచి కొలనుపాకను సందర్శిస్తారు. గవర్నర్ పర్యటనకు నాలుగు జిల్లాల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్‌ వర్మ రానున్న నేపత్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?