posted on Aug 27, 2024 10:26AM
యాపిల్ కొత్త సీఎఫ్ఓగా భారత సంతతి వ్యక్తి కెవన్ పారేఖ్ ఎంపికయ్యారు. ఇప్పటి వరకూ ఫైనాన్షియల్ ప్లానింగ్, అనాలసిస్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న కేవన్ పారేఖ్ వచ్చే ఏడాది జనవరి 1న యాపిల్ సీఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.
గత 11 సంవత్సరాలుగా కంపెనీ ఆర్థిక వ్యూహాల్లో కీలకంగా వ్యవహరించిన పారేఖ్ వరల్డ్ వైడ్ సేల్స్, రిటైల్, మార్కెటింగ్ విభాగాల్లో పనిచేశారు. కొత్త సీఎఫ్ఓగా పారేఖ్ ఎంపిక పట్ల యాపిల్ సీఈవో కుక్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన గైడెన్స్ యాపిల్ ను మరింత ముందుకు తీసుకువెడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.