- ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలపై ఈడీ కేసు..
-
ఎఫ్ఐఆర్లో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పేరు చేర్చిన ఈడీ.. -
సందీప్ ఘోష్ను విచారించేందుకు సిద్ధమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..

RG Kar Ex-Principal: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం కేసు నమోదు చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7తో పాటు నేరపూరిత కుట్ర, మోసం, నిజాయితీ లాంటి సెక్షన్ల కింద సందీప్ ఘోష్ పేరును ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కోల్‌కతా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నుంచి సీబీఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత శనివారం (ఆగస్టు 24) ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
అయితే, డాక్టర్ సందీప్ ఘోష్ ఫిబ్రవరి 2021 నుంచి సెప్టెంబర్ 2023 వరకు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి ప్రిన్సిపాల్‌గా పని చేశారు. 2023 అక్టోబర్ లో అతడ్ని బదిలీ చేసినప్పటికీ.. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన రోజు వరకు అతను ఈ ప్రిన్సిపాల్ గా కొనసాగారు. ఈ సంఘటన తర్వాత డాక్టర్ ఘోష్‌ని ఆర్జీ కర్ హాస్పిటల్‌లో ప్రిన్పిపాల్ గా తొలగించిన గంటల వ్యవధిలో కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చీఫ్ గా ఘోష్ ని నియమించింది. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర వివాదాలకు దారి తీసింది.