- రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
- ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ.

రేపు (బుధవారం) తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా.. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.